జఫర్గడ్: అక్టోబర్ 3 (తెలంగాణ గొంతుక) వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల కమిషన్ ఓటరు నమోదు నోటిఫికేషన్ విడుదల చేసింది. దానికి సంబంధించిన నమోదు ప్రక్రియను ఇప్పటికే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ముమ్మరం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మాజీ ఉపముఖ్యమంత్రి డా.తాటికొండ రాజయ్య సూచనల మేరకు జాఫర్ గడ్ మండల కేంద్రంలోని బాలాజీ ఇంటర్నెట్ సెంటర్ వద్ద ఓటర్ నమోదు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది.మండల పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నమోదు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల పట్టభద్రుల ఓటరు నమోదును చేపట్టడం జరిగిందని, అన్ని గ్రామాలకు గ్రాడ్యుయేట్లను ఇంచార్జీలుగా ఎంపిక చేసి నమోదు చేస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చే కేసిఆర్ ప్రభుత్వానికి ఈ ఎన్నిక సంకేతం కాబోతుందని అన్నారు. మంటతో ఉన్న యువతరం తమ తడాఖాను చూపించే సమయం ఆసన్నమైందని జైపాల్ రెడ్డి అన్నారు.బీఆర్ఎస్వి కాకతీయ యూనివర్సిటీ నాయకులు పిన్నింటి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నయవంచక పాలనతో నిరుద్యోగులను, విద్యార్థులను గోస పెడుతున్న రేవంత్ సర్కారుకు కర్రు కాల్చి వాత పెట్టే అవకాశం మళ్లీ పట్టభద్రుల ఓటు రూపంలో మన వద్దకు వస్తుంది ఈ అవకాశంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని అందుకోసం బాధ్యతగా పట్టభద్రులం అందరం ఓటును నమోదు చేసుకోవాలని విజయ్ కోరారు.అనంతరం మండల కమిటీ ఆధ్వర్యంలో సీఈఓ తెలంగాణ వెబ్సైట్ ద్వారా ఓటర్ నమోదు ప్రక్రియను జైపాల్ రెడ్డి ప్రారంభించారు.మండల కమిటీ కలిసికట్టుగా వెళ్లి తహశీల్దార్ కర్యాలయంలో ఫార్మ్ 18 ద్వారా దరఖాస్తులను అందుబాటులో ఉన్న అధికారికి అందజేశారు.ఈ సందర్భంగా అన్ని గ్రామాల పట్టభద్రులకు తమ ఓటు నమోదుకు అప్పీల్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు కడారి శంకర్, నజీర్,పెంతల రాజ్‌కుమార్, యార సోమిరెడ్డి,కలకోట రాజనీకాంత్, జాఫర్ఘడ్ ఉప సర్పంచ్ కొత్వాల కుమార్, స్థానిక గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీధర్, తిడుగు గ్రామ శాఖ అధ్యక్షులు రవి, సాగరం గ్రామ శాఖ ఇంచార్జి బోరగాని రాజేశ్వర్ రావు, తిడుగు ఉప సర్పంచ్ మనోహర్, యువజన నాయకులు నల్లతీగల శ్రీకాంత్, ప్రసన్న, పవన్, హరీష్ తదితరులు పాల్గొన్నారు.