వర్ధన్నపేట: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్‌రెడ్డి పేరును పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్న నేపథ్యంలో వర్ధన్నపేట మున్సిపల్ బీఆర్‌ఎస్ నేతలు ఆయనను కలిశారు. మున్సిపల్ పట్టణ పార్టీ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, సోషల్ మీడియా కన్వీనర్ సిలివేరు శ్రీధర్ యాదవ్, బీఆర్‌ఎస్ నాయకుడు తుమ్మల శ్రీధర్ తదితరులు రాకేష్‌రెడ్డితో సమావేశమయ్యారు. నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.