🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 1:44 pm Posted by : Telangana Gontuka

తహసీల్దార్ కార్యాలయంలోనే ప్రాణాలు తీసుకున్న రైతు

News Image

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలం పారుపల్లికి చెందిన రైతు లవప్ప(53) శనివారం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఆత్మహత్య చేసుకున్నాడు.

వంశపారంపర్యంగా 19 ఎకరాలు ఉండాల్సి ఉండగా, 18 ఎకరాలే తన ఆధీనంలో ఉందని, మిగిలిన ఎకరా పొరుగు రైతుల భూమిలో ఉందని అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ఈ వివాదంతో పొరుగు రైతులతో గొడవ పడి, మధ్యవర్తి చేతిని కొరకడంతో పోలీసులకు ఫిర్యాదు కూడా వెళ్లింది.

సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురైన లవప్ప, శనివారం తెల్లవారుజామున తహసీల్దార్ కార్యాలయ ప్రహరీ దూకి లోపలికి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
🏠 Home