మహబూబాబాద్: మరిపెడ మండలం గుర్రప్పతండా గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై బానోత్ మహేందర్ అనే యువరైతు మృతి చెందాడు. వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురైనట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. యువరైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.