🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 9:21 am Posted by : Telangana Gontuka

సీఎం రేవంత్‌రెడ్డి నేటి షెడ్యూల్‌

News Image
హైదరాబాద్‌, అక్టోబర్‌ 3: ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు తాజ్‌కృష్ణ హోటల్‌లో నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (NALSA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సౌత్‌ జోన్‌ రీజినల్‌ కాన్ఫరెన్స్‌’ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. ఈ సందర్భంగా న్యాయ సేవలు, న్యాయ సహాయం, అవగాహన, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానాలపై చర్చలు జరగనున్నాయి. తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అందిస్తున్న సేవలను కూడా కార్యక్రమంలో ప్రస్తావించనున్నారు.
🏠 Home