కొత్తగూడెం: నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె ప్రియుడు పవన్‌కుమారే హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేల్చారు. పెళ్లికి హరిణి నిరాకరించడంతో కక్ష పెంచుకున్న పవన్‌కుమార్ ఆమెను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బైక్ క్లచ్ వైర్‌తో గొంతు బిగించి హత్య చేసినట్లు తెలిపారు. అనంతరం పరారైన నిందితుడిని సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. కేసులో మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.