హైదరాబాద్: నల్గొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ ప్రకటించిన రాంరెడ్డి సర్వోత్తం రెడ్డి పోటీపై అనాసక్తిగా ఉన్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. తనను సంప్రదించకుండానే అభ్యర్థిగా ప్రకటించారని, తాను ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేయాలనుకుంటున్నట్లు ఆయన చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఆయన నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ప్రకటించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు సర్వోత్తం రెడ్డి ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను కలిసి అభ్యర్థిత్వంపై కృతజ్ఞతలు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన నిజంగానే పోటీ నుంచి తప్పుకుంటారా? లేక ప్రచారంతోనే ఈ చర్చ మొదలైందా? అన్నది ఆసక్తికరంగా మారింది.