🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 8:52 am Posted by : Telangana Gontuka

కన్నడ నటి రన్యారావుకు భారీ షాక్‌.. రూ.89.91 కోట్ల పెనాల్టీ!

News Image
బెంగళూరు: గోల్డ్‌ స్మగ్లింగ్‌ కేసులో కన్నడ నటి రన్యారావుకు కస్టమ్స్‌ శాఖ భారీ జరిమానా విధించింది. ఆమెకు రూ.89.91 కోట్ల పెనాల్టీ విధిస్తూ 399 పేజీల అడ్జుడికేషన్‌ ఆర్డర్‌ జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. దుబాయ్‌ నుంచి బంగారం అక్రమంగా తరలించిన కేసులో రన్యారావుతో పాటు మరో ముగ్గురిపై కలిపి రూ.244 కోట్లకు పైగా జరిమానా విధించారు. 2025 మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో రన్యారావు వద్ద 14.2 కిలోల బంగారం పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కస్టమ్స్‌ చర్య క్రిమినల్‌ కేసుకు భిన్నమైనదని అధికారులు తెలిపారు.
🏠 Home