న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కాక్‌పిట్‌లో జరిగిన దాడి ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ గాయపడినప్పటికీ విమానాన్ని సురక్షితంగా దారి మళ్లించడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం సౌదీ అరేబియాలోని తబూక్లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానంలోని 174 మంది ప్రాణాలతో బయటపడ్డారు.