న్యూఢిల్లీ: జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే భారత్ ఆరు స్వర్ణాలు సహా 10 పతకాలు సాధించింది. ఆర్చరీ, హాకీ, రెజ్లింగ్ తదితర విభాగాల్లో భారత క్రీడాకారులు సత్తాచాటారు. శనివారం పోటీలతో భారత్ ప్రస్థానం ముగియనుంది. చివరి రోజు కూడా పలు విభాగాల్లో భారత అథ్లెట్లు పతకాల కోసం బరిలోకి దిగనున్నారు.