🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 8:27 am Posted by : Hanumkonda

సహచరులతో విందు.. ఆపై వాగులో విషాదం

News Image
ఖానాపురం: సహచరులతో కలిసి విందుకు వచ్చిన బ్యాంకు ఉద్యోగి ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందాడు. గీసుకొండ మండలం మచ్చాపూర్‌కు చెందిన బిల్లా సునీల్‌(33) శుక్రవారం సహచరులతో కలిసి పాకాలకు వచ్చాడు. గిరికతాటి సమీపంలో విందు అనంతరం ఈతకు దిగాడు. చెట్టుపై నుంచి వాగులోకి దూకగా లోతైన నీటిలో మునిగి గల్లంతయ్యాడు. పోలీసులు, జాలర్ల సహకారంతో గాలించి రాత్రి మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home