ఎన్సీసీ అధికారిపై విద్యార్థిని ఫిర్యాదు
వరంగల్: దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్సీసీ అధికారిపై ఓ విద్యార్థిని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారి కళాశాలలో అన్ని విషయాల్లో పెత్తనం చెలాయిస్తున్నారని, తనను బయట కలవాలంటూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ సెప్టెంబరు 30న ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై ప్రిన్సిపాల్ స్పందిస్తూ.. కళాశాలలో అలాంటి ఘటనలు జరిగినట్లు తన దృష్టికి రాలేదన్నారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో విచారణ చేపడతామని తెలిపారు.