🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 03 October 2026, 8:20 am Posted by : Telangana Gontuka

వరంగల్‌లో గంజాయి దందా.. యువతే టార్గెట్‌!

News Image
వరంగల్‌: ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి నగరానికి గంజాయి సరఫరా అవుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు సాగుతున్నట్లు సమాచారం. కొన్ని పాన్‌షాపుల్లో సిగరెట్లలో గంజాయి నింపి విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నగరంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో యువత గంజాయి సేవిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రాత్రివేళ కొందరు యువకులు మద్యం, గంజాయి మత్తులో వాహనాలతో హంగామా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి దందాను అరికట్టాలని నగరవాసులు కోరుతున్నారు.
🏠 Home