వరంగల్:వర్ధన్నపేట పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి ఐదుగురు సభ్యులతో ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ శాఖ శనివారం తెలిపింది. ఆసక్తి ఉన్నవారు నోటీసు జారీ చేసిన తేదీ నుంచి 20 రోజుల్లోగా నిర్ణీత నమూనాలో ట్రస్టీ పదవికి దరఖాస్తు చేసుకోవాలని దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ సూచించారు. వ్యవస్థాపక కుటుంబ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులను పరిశీలించి పోలీసు వెరిఫికేషన్‌కు పంపనున్నట్లు పేర్కొన్నారు.