🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 5:32 pm Posted by : Telangana Gontuka

హరిణి హత్య కేసులో వీడిన మిస్టరీ.. ప్రియుడే నిందితుడు

News Image
ఖమ్మం:కొత్తగూడెం నర్సింగ్ విద్యార్థిని హరిణి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆమె ప్రియుడు పవన్‌కుమారే హత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. పెళ్లికి నిరాకరించిందనే కక్షతో బైక్ క్లచ్ వైర్‌తో గొంతు బిగించి హరిణిని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పరారీలో ఉన్న పవన్‌కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
🏠 Home