🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 5:22 pm Posted by : Telangana Gontuka

చెట్లు నరికితే చాలా బాధ కలుగుతుంది: పవన్ కల్యాణ్

News Image
అన్నమయ్య జిల్లా: తాను ప్రకృతి ప్రేమికుడినని, చెట్లను నరికితే ఎంతో బాధ కలుగుతుందని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఒక చెట్టును నాటడం, దాన్ని పెంచడం ఎంతో కష్టమని పేర్కొన్నారు.
గతంలో పచ్చని చెట్లను నరికిన సందర్భాలు ఉన్నాయని పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. రాయలసీమ ఎంతో గొప్ప నేల అని, ఇక్కడి రైతుల్లో పట్టుదల ఎక్కువగా ఉంటుందని అన్నారు. రాయలసీమను ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
🏠 Home