చంద్రబాబుకు రైతుల కష్టాలు బాగా తెలుసు: లోకేశ్
1997లోనే చంద్రబాబు ఇజ్రాయెల్ నుంచి డ్రిప్ ఇరిగేషన్‌ను తీసుకొచ్చి రైతులకు పరిచయం చేశారని లోకేశ్ పేర్కొన్నారు. తాను చేపట్టిన యువగళం పాదయాత్ర రాయలసీమ నుంచే ప్రారంభమైందని, ఆ సమయంలో ఎదురైన ఇబ్బందులను గుర్తుచేసుకున్నారు. రాయలసీమ ప్రజల ఆశీస్సులతోనే పాదయాత్రను కొనసాగించగలిగామని తెలిపారు.