🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 5:11 pm Posted by : Telangana Gontuka

ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం.. 11 మెట్రో స్టేషన్ల మూసివేత

News Image
న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసనలకు పిలుపునివ్వడంతో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో నిరసనల నేపథ్యంలో 11 మెట్రో స్టేషన్ల ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను మూసివేశారు.
జంతర్‌ మంతర్‌, కన్నాట్‌ ప్లేస్‌, పార్లమెంట్‌ స్ట్రీట్‌, టాల్‌స్టాయ్‌ మార్గ్‌ తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు అమలు చేస్తున్నారు. జంతర్‌ మంతర్‌ పరిసరాల్లో మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవలను కూడా తాత్కాలికంగా నిలిపివేసినట్లు తాజా నివేదికలు పేర్కొన్నాయి.
🏠 Home