న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖులు గాంధీజీకి నివాళులు అర్పించారు. ఇదే రోజున మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి జయంతి కూడా జరుపుకుంటున్నారు. మరోవైపు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. దీంతో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో శుక్రవారం సాధారణ ఈక్విటీ ట్రేడింగ్ జరగదు.