🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 11:59 am Posted by : Telangana Gontuka

తీన్మార్ మల్లన్న పాదయాత్రకు జిన్నారం గ్రామ ప్రజల సంఘీభావం

News Image
మరికల్: నారాయణపేట జిల్లా మరికల్ మండలం జిన్నారం గ్రామానికి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మల్లన్నను కలిసి యాత్రకు సంఘీభావం తెలిపారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం, రాజ్యాధికారమే లక్ష్యంగా కొనసాగుతున్న యాత్రకు తమ మద్దతు ప్రకటించారు.
గ్రామ ప్రజలు మల్లన్నతో కలిసి కొంతదూరం పాదయాత్రలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా మల్లన్న గ్రామ ప్రజలను ఆప్యాయంగా పలకరించి బీసీల హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం తదితర అంశాలపై వారితో మాట్లాడారు.
🏠 Home