హైదరాబాద్:శంషాబాద్ నుంచి కడపకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు హల్‌చల్ చేశాడు. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో విమానంలోని ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.