తీర్పు వచ్చే వరకూ.. ఉపఎన్నిక వద్దు!
హైదరాబాద్ : ఖైరతాబాద్ ఉపఎన్నిక వ్యవహారం కీలక మలుపు తిరిగింది. దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ విజయారెడ్డి దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్‌పై తీర్పు వెలువడే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వవద్దని ఆమె హైకోర్టును కోరారు. ఈ వాదనపై ఈసీ తరఫు న్యాయవాది ప్రాథమికంగా అంగీకారం తెలిపారు. దీంతో తీర్పు వచ్చే వరకు ఉపఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయబోమని అఫిడవిట్ దాఖలు చేయాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 6కు వాయిదా వేసింది. దానం నాగేందర్ ఎన్నిక చెల్లదని తేలితే, 2023 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తనను ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందని విజయారెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో ఖైరతాబాద్ ఉపఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.