గాంధీజీపై అభిమానం.. ఇంటి వద్దే విగ్రహం
బాలజోజి తండ్రి రాయన్న సుమారు 65 ఏళ్ల క్రితం ఇంట్లోనే గాంధీజీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. పాత ఇల్లు శిథిలావస్థకు చేరడంతో కొత్తగా నిర్మించిన ఇంటి ప్రహరీపై తండ్రి స్ఫూర్తితో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు బాలజోజి చెప్పారు. చిన్నప్పటి నుంచి తన తండ్రి గాంధీజీ జీవితం, సిద్ధాంతాల గురించి చెబుతుండేవారని, అప్పటి నుంచే మహాత్ముడిపై తనకు అభిమానం ఏర్పడిందన్నారు.
గ్రామంలో తనను ‘బాలజోజి’ కంటే ‘గాంధీ బాలజోజి’ అని పిలిస్తేనే ఎక్కువ మంది గుర్తుపడతారని తెలిపారు. ప్రతి ఏటా ఆగస్టు 15, అక్టోబర్ 2న గాంధీజీ విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా విగ్రహం చేతిలోని కర్రకు నిత్యం జాతీయ జెండాను ఎగురవేస్తూ బాపూజీ పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకుంటున్నారు.