🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 02 October 2026, 7:42 am Posted by : Telangana Gontuka

కాంక్రీట్ లారీ ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి

News Image
హన్మకొండ:శాయంపేట మండలం కొత్తగట్టు–సింగారం ప్రధాన రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. పరకాల నుంచి హనుమకొండ వైపు ట్రాక్టర్‌పై వెళ్తున్న యజ్జెల శ్రీను (25)ను మందారిపేట దాటిన తర్వాత వెనుక నుంచి వచ్చిన కాంక్రీట్ లారీ ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తాపడగా, డ్రైవర్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలగగా పోలీసులు క్లియర్ చేశారు. మృతదేహాన్ని పరకాల మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
🏠 Home