నేడు వైన్స్ షాపులు బంద్
హైదరాబాద్: గాంధీ జయంతి సందర్భంగా నేడు(అక్టోబర్ 2) హైదరాబాద్లో మద్యం విక్రయాలు నిలిచిపోనున్నాయి. నగర పరిధిలోని వైన్స్ షాపులు, బార్లు, పబ్లు, క్లబ్లు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. డ్రై డే నిబంధనలను ఉల్లంఘించి మద్యం విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు హెచ్చరించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది అక్టోబర్ 2న మద్యం విక్రయాలపై ఆంక్షలు అమలవుతున్నాయి.