హనుమకొండ: కాజీపేట మండలం టేకులగూడెం క్రాస్ వద్ద జాతీయ రహదారి-163పై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వేలేరు ఎస్సై సురేష్‌కు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఎస్సైని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. ప్రమాదానికి దారితీసిన కారణాలు, వాహనాల వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.