🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 01 October 2026, 10:45 pm Posted by : Telangana Gontuka

కలలోకి వచ్చి పిలుస్తున్నాడని.. యువతి దారుణ నిర్ణయం

News Image

శంషాబాద్‌: ప్రేమించిన వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన శంషాబాద్‌లో చోటుచేసుకుంది. సిద్ధార్థ కాలనీకి చెందిన 19 ఏళ్ల బూర నర్మదకు నిజామాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌ బేజనీ గౌడ్‌తో ప్రేమ సంబంధం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరూ వివాహం చేసుకుని కలిసి జీవించాలని నిర్ణయించుకున్న సమయంలో సిద్ధార్థ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో నర్మద తీవ్రంగా కుంగిపోయిందని తెలిపారు. ఇటీవల సిద్ధార్థ్‌ తన కలలోకి వచ్చి తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడని నర్మద తల్లిదండ్రులు, సోదరితో చెప్పినట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.
🏠 Home