🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 01 October 2026, 10:42 pm Posted by : Telangana Gontuka

నా హోటళ్లకు పబ్లిసిటీ చేసినందుకు థాంక్స్: కేటీఆర్

News Image
హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సిరిసిల్ల సభలో తన హోటళ్లపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 2009 ఎన్నికల అఫిడవిట్‌లోనే తన వ్యాపార వివరాలను వెల్లడించానని తెలిపారు. తనకు మూడు హోటళ్లు ఉన్నాయని, రాజకీయాలు వదిలి వ్యాపారంపై దృష్టి పెట్టి ఉంటే ఇప్పటికి పది హోటళ్లు ఉండేవని అన్నారు. తన హోటళ్లకు పబ్లిసిటీ చేసినందుకు రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలకు కేటీఆర్ ఈ విధంగా స్పందించారు.
🏠 Home