కత్తిపోట్లతో రక్తమోడినా.. 174 మందిని కాపాడిన భారత పైలట్!
నెతన్యాహు ప్రశంసలు
భారత కెప్టెన్ చూపిన ధైర్యాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. గాయపడినా పోరాడి కాక్‌పిట్ తలుపు తెరిచి ప్రయాణికులు, సిబ్బందికి లోపలికి వచ్చే అవకాశం కల్పించారని పేర్కొంటూ ఆయనకు సెల్యూట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మచార్‌ను ‘రియల్ హీరో’గా అభివర్ణించినట్లు భారతీయ మీడియా నివేదించింది.
ఎవరీ స్మిత్ మచార్?
స్మిత్ మచార్ భారతీయ పైలట్. 2022 జూన్‌లో ఫ్లైదుబాయ్‌లో కెప్టెన్‌గా చేరకముందు సుమారు 11 సంవత్సరాలు స్పైస్‌జెట్‌లో పనిచేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. బోయింగ్ 737 సిరీస్ విమానాల్లో ఆయనకు విస్తృత అనుభవం ఉందని, 9,750 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవం ఉన్నట్లు ఆయన ప్రొఫైల్ ఆధారంగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందుతున్నట్లు సమాచారం. ఘటనపై సౌదీ అధికారులు, సంబంధిత భద్రతా సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.