🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 01 October 2026, 9:44 pm Posted by : Telangana Gontuka

దివేఆగర్ బీచ్‌లో విషాదం.. 8 మంది విద్యార్థుల మృతి!

News Image
ముంబై: మహారాష్ట్రలోని రాయగఢ్ జిల్లా దివేఆగర్ సముద్రతీరంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. పుణే జిల్లా ఆళందిలోని ‘విన్నర్స్ అకాడమీ’కి చెందిన 11, 12వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిపి 48 మంది విహారయాత్రకు వెళ్లారు. ఇందులో 25 మంది బాలురు, 17 మంది బాలికలు, ఆరుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. సముద్రంలో ఈతకు దిగిన ఎనిమిది మంది బాలురు బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానికులు, వాటర్ స్పోర్ట్స్ సిబ్బంది, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినా.. ఎనిమిది మందినీ కాపాడలేకపోయారు. మృతదేహాలను వెలికితీసి బోర్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా వైద్యులు మృతులుగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home