🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 01 October 2026, 9:06 pm Posted by : Telangana Gontuka

స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం.. ఇన్వెస్టర్లకు షాక్‌!

News Image
ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లలో గురువారం భారీ అమ్మకాల ఒత్తిడి నెలకొంది. సెన్సెక్స్‌ 1,000 పాయింట్లకు పైగా పతనం కాగా, నిఫ్టీ 22,300 స్థాయికి దిగువకు వెళ్లింది. విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరుగుదల, రూపాయి బలహీనత, క్రూడ్‌ ఆయిల్‌ ధరల్లో ఒడిదుడుకులు మార్కెట్‌పై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఆటో రంగ షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక్కరోజులోనే మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌లో సుమారు రూ.9 లక్షల కోట్ల సంపద ఆవిరైనట్లు నివేదికలు వెల్లడించాయి.
🏠 Home