🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 01 October 2026, 5:16 pm Posted by : Telangana Gontuka

బాపట్ల పోలీసులకు సీఎం చంద్రబాబు అభినందనలు

News Image
బాపట్ల: మహిళల భద్రత, గంజాయి నిర్మూలనలో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న బాపట్ల జిల్లా పోలీస్‌ యంత్రాంగాన్ని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. గురువారం రేపల్లె నియోజకవర్గంలో నిర్వహించిన ‘పేదల సేవలో’ కార్యక్రమంలో సీఎం పాల్గొని పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసుల పనితీరును ప్రత్యేకంగా ప్రశంసించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో బాపట్ల జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న నేరాల నియంత్రణలో రాష్ట్ర సగటు కంటే 2.99 శాతం మెరుగైన ఫలితాలు సాధించారని తెలిపారు. అలాగే గంజాయి రవాణా, విక్రయాలను అరికట్టడంలో రాష్ట్ర సగటు కంటే 2.27 శాతం అధిక పురోగతి సాధించినట్లు వెల్లడించారు.
జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, పోలీస్‌ సిబ్బంది కృషిని సీఎం అభినందించారు. మహిళల భద్రతకు మరింత ప్రాధాన్యం ఇస్తూ, గంజాయి నిర్మూలనపై కఠిన చర్యలు కొనసాగించాలని సూచించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే విధంగా పటిష్టంగా విధులు నిర్వహించాలని పోలీస్‌ యంత్రాంగానికి సీఎం సూచించారు.
🏠 Home