అంగన్వాడీ సిబ్బందిని సత్కరించిన మాజీ ఎమ్మెల్యే
ఈ సందర్భంగా కొండేటి శ్రీధర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషణ కోసం అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందుతున్న సేవల ప్రాధాన్యాన్ని వివరించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు తదితర పోషకాహారాన్ని పంపిణీ చేశారు.
కార్యక్రమంలో డా. వన్నాల వెంకటరమణ, కంభంపాటి పుల్లారావు, మల్లాడి తిరుపతిరెడ్డి, మంజులరెడ్డి, రేణుకతో పాటు బీజేపీ నాయకులు, మహిళా మోర్చా ప్రతినిధులు పాల్గొన్నారు