హనుమకొండ: జర్నలిస్టులకు క్యాష్‌లెస్ హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా TUWJ (H143) ఆధ్వర్యంలో పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టనున్నట్లు యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు మస్కపురి సుధాకర్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లోని గాంధీ విగ్రహం ఎదుట ఉదయం 10 గంటలకు నిరసన నిర్వహించనున్నట్లు చెప్పారు. జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.