జనగామ: జర్నలిస్టుల హక్కులు, భద్రత, సంక్షేమం కోసం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ‘డిమాండ్ల దినోత్సవం’ నిర్వహిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఇర్రి మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి సురిగల బిక్షపతి తెలిపారు. జనగామలోని గాంధీ విగ్రహం వద్ద ఉదయం 10 గంటలకు శాంతియుత నిరసన చేపట్టనున్నట్లు చెప్పారు. జర్నలిస్టులకు ప్రత్యేక భద్రతా చట్టం, కొత్త వేజ్ బోర్డు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇళ్ల మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.