వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)కి ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీని నియమించింది. హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ చైర్‌పర్సన్‌గా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా సహకార అధికారి సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ ఆరు నెలలు లేదా ఎన్నికలు జరిగే వరకు, తదుపరి ఉత్తర్వుల్లో ఏది ముందైతే అది వరకు కొనసాగనుంది. పాలకమండలి లేకపోవడంతో రుణాల ఆమోదం, ఆడిట్ నివేదికల సమర్పణ తదితర ప్రక్రియల్లో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది.