జనగాం: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కులం పేరుతో దూషించడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో ఆడియో పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వినయ్‌కుమార్ తెలిపారు. శివునిపల్లికి చెందిన వ్యాపారి శ్రీనివాస్ ఎమ్మెల్యేను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ ఆడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. దీనిపై ఇంద్రనగర్‌కు చెందిన రాజు పోలీసులకు ఫిర్యాదు చేయగా, శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.