ఆస్ట్రేలియాలోని సిడ్నీ మహానగర పరిధిలో తెలుగు మహిళ సంధ్యారెడ్డి అరుదైన ఘనత సాధించారు. స్ట్రాత్‌ఫీల్డ్ మున్సిపల్ కౌన్సిల్ 73వ మేయర్‌గా సంధ్యారెడ్డి ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియాలోని స్థానిక పాలనలో కీలక బాధ్యతలు చేపట్టిన తెలుగు మహిళగా ఆమె గుర్తింపు పొందారు. మేయర్‌గా ఎన్నిక కావడం పట్ల ఆస్ట్రేలియాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు, ప్రవాసాంధ్రులు హర్షం వ్యక్తం చేస్తూ సంధ్యారెడ్డికి అభినందనలు తెలిపారు. కౌన్సిల్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు స్థానిక అభివృద్ధికి కృషి చేస్తానని సంధ్యారెడ్డి పేర్కొన్నారు.