పీడీఎస్ బియ్యం అక్రమ విక్రయం.. ఇద్దరి అరెస్ట్
ఇంతేజార్గంజ్ పరిధిలో కొడూరు జ్ఞాణేశ్వర్ (62)ను అరెస్ట్ చేసి 95 బస్తాల్లోని 2,470 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గాయత్రి రైస్‌మిల్ యజమాని కుసుమ రవి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
మట్వాడ పరిధిలో కొల్లేటి వేణుగోపాల్ (56)ను అరెస్ట్ చేసి 257 బస్తాల్లోని 6,400 కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అతనితో కలిసి అక్రమంగా బియ్యం వ్యాపారం చేసిన జైపాల్‌రెడ్డి, ఎరుకుల్ల రమేష్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.