🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 30 September 2026, 1:15 pm Posted by : Telangana Gontuka

డ్రగ్స్‌ మాఫియాపై వీరోచిత పోరు!

News Image
చెన్నై: మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై తమిళనాడు పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా సాహసోపేతంగా విధులు నిర్వర్తించిన పోలీసు సిబ్బందిని సీఎం సి.జోసెఫ్‌ విజయ్‌ అభినందించారు. ఇటీవల కోయంబత్తూరు జిల్లాలో గుట్కా అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో కోవిల్పాళయం పోలీస్‌స్టేషన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ ఎం.వేల్మురుగన్‌ దాదాపు 40 కిలోమీటర్ల మేర కదులుతున్న ఎస్‌యూవీపై ఉండి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలో 100 కిలోలకుపైగా నిషేధిత గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ధైర్యాన్ని సీఎం విజయ్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. మరోవైపు రాష్ట్రంలో మాదకద్రవ్యాల తయారీ, అక్రమ రవాణా నియంత్రణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. 2026లో డ్రగ్స్‌ నిర్మూలనలో విశేషంగా పనిచేసిన 15 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి సీఎం పోలీస్‌ మెడల్స్‌ ప్రకటించారు. ఆగస్టులో చెన్నైలో నిర్వహించిన ‘డ్రగ్‌-ఫ్రీ తమిళనాడు’ కార్యక్రమంలో సీఎం విజయ్‌ ఈ పోలీసులను సత్కరించారు.
🏠 Home