హైదరాబాద్: చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో మూడేళ్ల బాలికతో అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అంజద్ ఖాన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, కారణాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.