హైదరాబాద్‌కు చెందిన 37 ఏళ్ల మొహమ్మద్ అహ్మద్ రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. నిర్మాణ రంగంలో ఉద్యోగం కోసం ఈ ఏడాది ఏప్రిల్‌లో రష్యాకు వెళ్లిన ఆయనను ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఏజెంట్ మోసం చేసినట్లు సమాచారం. అక్కడికి వెళ్లిన కొద్ది వారాలకే రష్యా సైన్యంలో చేరాల్సి వచ్చిందని అహ్మద్ తెలిపినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. కాలు విరిగినా, తాను యుద్ధం చేయలేనని చెబుతున్నా సైన్యం బలవంతంగా యుద్ధానికి పంపేందుకు ప్రయత్నిస్తోందని ఆయన వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. అహ్మద్‌ను స్వదేశానికి తీసుకురావాలని ఆయన భార్య అఫ్షా బేగం భారత విదేశాంగ శాఖను కోరుతున్నారు.