🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 30 September 2026, 10:47 am Posted by : Telangana Gontuka

గండిరామారం లిఫ్ట్‌ పనులను పరిశీలించిన కడియం శ్రీహరి

News Image
జనగామ: చిల్పూర్ మండలం లింగంపల్లి శివారులో నిర్మిస్తున్న గండిరామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్‌-1 పంప్‌హౌస్‌ నిర్మాణ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. ఇరిగేషన్‌ అధికారులతో కలిసి నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పంప్‌హౌస్‌ నిర్మాణంలో చేపడుతున్న వివిధ పనులు, ఇప్పటివరకు పూర్తయిన పనుల వివరాలను అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. రైతులకు సాగునీరు అందించడంలో ఎత్తిపోతల పథకం కీలకంగా ఉండేలా పనులపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని కోరారు.
🏠 Home