మహబూబాబాద్:చిన్నగూడూరు మండల కేంద్రంలో ఆకేరు వాగులో ప్రమాదవశాత్తూ పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మానుపాటి ముత్తయ్య (43) తన పెదనాన్న మృతి సందర్భంగా మూడో రోజు కార్యక్రమానికి హాజరై అనంతరం వాగులో స్నానానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తూ కాలు జారి నీటిలో పడి మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, కుమారుడు జగదీష్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.