ములుగు: 2021లో వెంకటాపూర్ పోలీస్స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు క్రాంతికి ములుగు కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రామానుజాపూర్కు చెందిన క్రాంతిని దోషిగా నిర్ధారిస్తూ జడ్జి చంద్రకళ తీర్పు ఇచ్చారని ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ తెలిపారు. రూ.7 వేల జరిమానా కూడా విధించినట్లు పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో కృషి చేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.