తొర్రూరు: జనగామ జిల్లా కొడకండ్ల పోస్టాఫీసులో పనిచేస్తున్న అంకిత (25) మంగళవారం రాత్రి తొర్రూరులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆమె భర్తతో కలిసి తొర్రూరులో నివాసం ఉంటోంది. భార్యాభర్తల మధ్య కలహాలే కారణమై ఉండొచ్చని తెలుస్తున్నా.. మృతికి కుటుంబ కలహాలా, ఇతర కారణాలా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.