వర్ధన్నపేట: ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బెల్ట్‌షాపుల జోరు కొనసాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామాలు, మండల కేంద్రాలతో పాటు వర్ధన్నపేట పట్టణంలోనూ నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు. వైన్స్, బార్లు ఉన్నప్పటికీ రాత్రివేళ బెల్ట్‌షాపుల్లో మద్యం లభిస్తోందని ఆరోపిస్తున్నారు. జనావాసాల్లో షాపుల కారణంగా మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ఇళ్ల ముందు గొడవలు, ఖాళీ సీసాలు పడేయడం వంటి ఘటనలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎక్సైజ్ సీఐ జయశ్రీకి ఫిర్యాదు చేయగా పూర్తి విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.