🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 29 September 2026, 4:19 pm Posted by : Suresh Budige

ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు

News Image
జఫర్ ఘడ్, సెప్టెంబర్ 29 : జనగామ జిల్లా జఫర్ ఘడ్
మండల కేంద్రమైన రైతు వేదికలో పెట్టుబడి లేని జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ( ఎన్.ఎం. ఎన్ .ఎస్) పై రైతులకు మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.తెలంగాణ వ్యవసాయ కమిషనర్‌ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మండలంలోని హిమాయత్ నగర్ గ్రామంలో ఎన్ఎంఎన్ఎఫ్‌ పథకం కింద ఎంపికైన 125 మంది రైతులకు మండల వ్యవసాయ అధికారి చంద్రన్ కుమార్ కిట్లను పంపిణీ చేశారు. కిట్లలో రైతు డైరీ, క్యాలెండర్‌, బ్యాగ్‌, పెన్నులు, గుర్తింపు కార్డు, ఫోన్‌ బుక్‌ తదితర సామగ్రిని అందించారుఈ సందర్భంగా వ్యవసాయ అధికారులు మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించి పంటల సాగులో రసాయనాల వినియోగాన్ని తగ్గించుకోవాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకుని ఆరోగ్యకరమైన పంటల సాగుకు కృషి చేయాలని కోరారు. రసాయన ఎరువులు మరియు పురుగుల మందుల వాడకం వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా మానవ ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆరోగ్యకరమైన నేల - ఆరోగ్యకరమైన ఆహారం - ఆరోగ్యకరమైన భవిష్యత్తు" అనే నినాదంతో ప్రకృతి వైపు మళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
జీవామృతం, ఘనజీవామృతం మరియు కషాయాల తయారీ, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు రైతులకు క్షుణ్ణంగా వివరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించేందుకు సహజ వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు.. ఈ కార్యక్రమంలో హిమ్మత్ నగర్ సర్పంచ్ కడుతూరి మమత సోమయ్య, ఏ ఈ ఓ అనిత కృషికీలతో పాటు హిమ్మత్ నగర్ రైతులు పాల్గొన్నారు.
🏠 Home