🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 29 September 2026, 3:03 pm Posted by : satla anil kumar

మేడారంలో ‘ప్యారడైజ్’ టీమ్‌ సందడి సమ్మక్క–సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసిన హీరో నాని, చిత్రబృందంమేడారం: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క–సారలమ్మలను ‘ప్యారడైజ్’ సినిమా చిత్రబృందం మంగళవారం దర్శించుకుంది. సినిమా హీరో నాని, నటుడు సంపూర్ణ

News Image
ముఖ్యమైన పాయింట్స్:మేడారం: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క–సారలమ్మలను ‘ప్యారడైజ్’ సినిమా చిత్రబృందం మంగళవారం దర్శించుకుంది. సినిమా హీరో నాని, నటుడు సంపూర్ణేష్‌బాబు, దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌తో పాటు చిత్రబృంద సభ్యులు మేడారం చేరుకుని అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా సమ్మక్క–సారలమ్మలకు మొక్కులు చెల్లించి, వనదేవతల ఆశీస్సులు పొందారు. మేడారం ఆలయ ప్రాంగణానికి చేరుకున్న చిత్రబృందాన్ని చూసేందుకు భక్తులు, అభిమానులు ఆసక్తి చూపించారు. హీరో నాని, సంపూర్ణేష్‌బాబును చూసేందుకు పలువురు అభిమానులు తరలివచ్చారు.అమ్మవార్ల దర్శనం అనంతరం చిత్రబృందం మేడారం పరిసరాలను సందర్శించింది. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సమ్మక్క–సారలమ్మల క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చిత్రబృందం పేర్కొంది. ప్యారడైజ్ సినిమా విజయవంతం కావాలని వనదేవతలను ప్రార్థించినట్లు తెలిపింది.
మేడారం: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని వనదేవతలు సమ్మక్క–సారలమ్మలను ‘ప్యారడైజ్’ సినిమా చిత్రబృందం మంగళవారం దర్శించుకుంది. సినిమా హీరో నాని, నటుడు సంపూర్ణేష్‌బాబు, దర్శకుడు ఓదెల శ్రీకాంత్‌తో పాటు చిత్రబృంద సభ్యులు మేడారం చేరుకుని అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సమ్మక్క–సారలమ్మలకు మొక్కులు చెల్లించి, వనదేవతల ఆశీస్సులు పొందారు. మేడారం ఆలయ ప్రాంగణానికి చేరుకున్న చిత్రబృందాన్ని చూసేందుకు భక్తులు, అభిమానులు ఆసక్తి చూపించారు. హీరో నాని, సంపూర్ణేష్‌బాబును చూసేందుకు పలువురు అభిమానులు తరలివచ్చారు.
అమ్మవార్ల దర్శనం అనంతరం చిత్రబృందం మేడారం పరిసరాలను సందర్శించింది. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సమ్మక్క–సారలమ్మల క్షేత్రాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందని చిత్రబృందం పేర్కొంది. ప్యారడైజ్ సినిమా విజయవంతం కావాలని వనదేవతలను ప్రార్థించినట్లు తెలిపింది.
🏠 Home