🏠 telanganagontuka.com
Watermark
Newspaper Logo
Date of Publish : 29 September 2026, 1:32 pm Posted by : Telangana Gontuka

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి: కొండా సురేఖ

News Image
వరంగల్: తూర్పు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కొండా సురేఖ 111 మంది లబ్ధిదారులకు రూ.61 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను నిలిపివేసిందని ఆమె ఆరోపించారు. త్వరలోనే కల్యాణలక్ష్మి చెక్కులను కూడా అందజేస్తామని తెలిపారు.
ఎంజీఎం ఆసుపత్రి అభివృద్ధిపై మాట్లాడిన ఎమ్మెల్యే, గత పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆసుపత్రికి ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎనిమిది అంతస్తులను ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. గుత్తేదారు బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించలేకపోతున్నామని తెలిపారు.
తూర్పు నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారానికి వారానికి ఒక రోజు ఒక్కో డివిజన్‌లో పర్యటిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల సమస్యలను పరిష్కరిస్తామని, జర్నలిస్టులకు త్వరలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందిస్తామని తెలిపారు. కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీలోని వర్గ విభేదాలను పక్కనపెట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
🏠 Home